drugs: చొక్కా గుండీలలో రూ.16 కోట్ల విలువైన డ్రగ్స్ రవాణా

  • ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్ అరెస్టు
  • హ్యాండ్ బ్యాగులో హెరాయిన్ తరలిస్తూ పట్టుబడ్డ ఆఫ్రికా మహిళ
  • రెండు కేసుల్లో మొత్తం రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Cocaine and Heroin Worth rupees 47 Crore Was caught in Mumbai Airport

ఆఫ్రికా దేశాల నుంచి దొంగచాటుగా భారత్ కు మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను ముంబై విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి మొత్తం రూ.47 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీలలో ఈ స్మగ్లర్లను పట్టుకున్నారు.

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో దిగిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రయాణికుడికి చెందిన సూట్ కేసులో కుర్తా గుండీలు పెద్ద సంఖ్యలో కనిపించాయని అధికారులు చెప్పారు. అనుమానంతో మరింత జాగ్రత్తగా తనిఖీ చేయగా.. అందులో రహస్యంగా దాచి తీసుకొస్తున్న 1.596 కిలోల కొకైన్ బయటపడిందన్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 16 కోట్లు ఉంటుందని చెప్పారు. 

మరో కేసులో.. కెన్యా నుంచి వచ్చిన ప్రయాణికుడు తన హ్యాండ్ బ్యాగులో రహస్యంగా దాచి తరలిస్తున్న 4.47 కిలోల హెరాయిన్ ను గుర్తించామన్నారు. దీని విలువ సుమారు రూ.31 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

More Telugu News