Mekapati Chandra Sekhar Reddy: 18 ఏళ్లు రహస్యంగా ఉంచావ్.. నన్ను కొడుకుగా ఒప్పుకో: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ

Mekapati Siva Charan Reddy letter to Mekapati Chandra Sekhar Reddy
  • మేకపాటి కుటుంబంలో కలకలం
  • చంద్రశేఖర్ రెడ్డి కొడుకునంటూ శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ
  • మా అమ్మ తర్వాత వచ్చిన ఆమెను సమాజానికి పరిచయం చేశావంటూ మండిపాటు
ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద వివాదంలో చిక్కున్నారు. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ఈ లేఖ, పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ రెడ్డి అన్నారు. తనకు కుమారుడే లేడని మేకపాటి ఇటీవల చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా శివచరణ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. నీకు కొడుకు లేకపోతే... నేను ఎవరిని? అని ప్రశ్నించాడు. తనను కొడుకుగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు. 

చదువుకు ఫీజులు చెల్లిస్తే నీ బాధ్యత తీరిపోతుందా? అని శివచరణ్ రెడ్డి ప్రశ్నించాడు. తన తల్లి తర్వాత పరిచయమైన ఆమెను భార్యగా సమాజానికి పరిచయం చేశావని శివచరణ్ రెడ్డి మండిపడ్డాడు. ఈ లేఖతో పాటు, పాత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లేఖపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఈ వ్యవహారం మేకపాటి కుటుంబంతో పాటు, వైసీపీలో కూడా కలకలం రేపుతోంది.    
Mekapati Chandra Sekhar Reddy
YSRCP
Mekapati Siva Charan Reddy
Son

More Telugu News