తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు!
- నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని గదుల అద్దె రూ. 150 నుంచి రూ. 1,700కు పెంపు
- కార్నర్ సూట్ అద్దె ఇప్పుడు రూ. 2,200
- స్పెషల్ టైప్ కాటేజీల్లో గది అద్దె రూ.750 నుంచి రూ. 2,800కి పెంపు
- గది అద్దెకు సమానంగా డిపాజిట్
అద్దె మొత్తాన్ని పెంచడమే కాదు, అద్దెతోపాటు అంతే మొత్తంలో డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రూ. 1,700 గదిని అద్దెకు తీసుకుంటే అంతే మొత్తంలో డిపాజిట్ అంటే మరో రూ.1700 కలిపి మొత్తం రూ. 3,400ను చెల్లించాల్సి ఉంటుంది. తిరుమలలో ఉన్న 6 వేల గదుల్లో ఇటీవల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ. 110 కోట్లతో టెండర్లు ఆహ్వానించి ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాల కల్పన అనంతరం అద్దెను భారీగా పెంచారు.
అలాగే, సామాన్య భక్తులు ఎక్కువగా బస చేసే రూ. 50, రూ.100తో లభించే గదుల అద్దెలను కూడా త్వరలో పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ గదుల్లోనూ ఆధునికీకరణ పనులు చేపట్టి, అనంతరం అద్దె పెంపునకు రెడీ అవుతున్నట్టు సమాచారం.