consumers: సరుకులు డెలివరీ కావాలి కానీ.. చార్జీ మాత్రం వద్దంటున్న వినియోగదారులు

  • డెలివరీ చార్జీ చెల్లించేందుకు సుముఖంగా ఉన్నది 3 శాతం మందే
  • ఆర్డర్ ఇచ్చిన తర్వాత 24 గంటల వరకు వేచి ఉండేందుకు సముఖత
  • లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు
Indian consumers in no rush for faster grocery deliveries survey

ఆన్ లైన్ లో గ్రోసరీల కొనుగోలు నేడు ఎక్కువ అయింది. స్టోర్ వరకు వెళ్లి, కావాల్సినవన్నీ ఒకేసారి కొనుగోలు చేసి తెచ్చుకునేంత తీరిక, ఓపిక తగ్గిపోతున్నాయి. అందుకే నేడు ఎన్నో సంస్థలు గ్రోసరీపై దృష్టి పెట్టాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్, రిలయన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగా ఉంటుంది. అంతే కాదు, ఆర్డర్ ఇచ్చిన 10-20 నిమిషాల్లోపే డెలివరీ చేస్తామనే జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్, బిగ్ బాస్కెట్ నౌ, డంజో, జెప్టో కూడా ఉన్నాయి. 

అయితే, ఆన్ లైన్ లో గ్రోసరీ కోసం ఆర్డర్ చేసే వినియోగదారులు, డెలివరీ చార్జీలు చెల్లించేందుకు ఇష్టపడడం లేదు. అవసరమైతే గంటల తరబడి, ఒకటి రెండు రోజుల తర్వాత తెచ్చిచ్చినా ఫర్వాలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అర గంటలోపు కావాల్సిన సరుకులను పొందేందుకు అవసరమైతే డెలివరీ చార్జీ చెల్లించడానికి సముఖమేనన్నవారు కేవలం 3 శాతమేనని ఈ సర్వే వెల్లడించింది. 

ఆన్ లైన్ లో గ్రోసరీ ఆర్డర్లు ఇచ్చే వినియోగదారుల్లో.. మూడింట ఒక వంతు మంది 3 గంటల నుంచి 24 గంటల్లో డెలివరీ కోరుకుంటున్నారు. పైగా డెలివరీ ఫీజు ఉండకూడదన్నదే వీరి అభిమతంగా ఉంది. ఇక మూడు గంటల్లోపే డెలివరీ చేస్తే తక్కువ మొత్తం డెలివరీ చార్జీ చెల్లిస్తామని 11 శాతం మంది చెప్పారు.

More Telugu News