Bollywood: సోనూ సూద్ ను మందలించిన నార్తర్న్ రైల్వే, ముంబై రైల్వే పోలీసులు.. కారణం ఇదే!

Sonu Sood travels on footboard of moving train Northern Railway bashes him
  • రైలులో ఫుట్ బోర్డ్ పై కూర్చొని ప్రయాణం చేసిన బాలీవుడ్ నటుడు
  • ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం
  • ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దంటూ హీరోకు రైల్వే పోలీసుల సూచన
కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి సాయం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకొని ఎంతో పేరు, ప్రజాదరణ పొందారు. కానీ, ఈ మధ్య ఆయన చేసిన ఓ పని చూసి సోషల్ మీడియాలో అందరూ నటుడిని తిట్టిపోస్తున్నారు. నార్నర్త్ రైల్వే, ముంబై పోలీస్ కమిషనరేట్ అతడిని మందలించింది. కదులుతున్న రైలు డోర్ తీసి ఫుట్ బోర్డ్ పై కూర్చొని ప్రయాణం చేసిన సోనూ సూద్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణమైంది. డిసెంబర్ 13వ తేదీన తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియోలో సోనూ.. వేగంగా వెళ్తున్న రైలులో డోర్ పక్కన కాళ్లపై ప్రమాదకరమైన రీతిలో కూర్చున్నారు.

దీనిపై స్పందించిన నార్నర్త్ రైల్వే ఇది చాలా ప్రమాదకరం అంటూ నటుడిని మందలించింది. జనవరి 4న తమ ట్విట్టర్ ఖాతాలో సోనూసూద్‌పై విమర్శలు గుప్పించింది. ఆయనను భారత ప్రజలకు సోనూ సూద్ రోల్ మోడల్ అని, ఇలాంటి వీడియోతో దేశానికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంది. ఇలా చేయొద్దని కోరింది. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా సోనూసూద్‌ను హెచ్చరించింది. ఇది ప్రమాదకరమని, నిజ జీవితంలో అలా చేయరాదని పేర్కొంది. అభిమానులు సైతం సోనూ సూద్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసి, స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఇలా ప్రమాదకరమైన పనులు చేయకూడదని సూచించారు.
Bollywood
Sonu Sood
train
police
footboars

More Telugu News