new years resolution: న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే ఇదేనా..!: ఆలోచింపజేసే ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra shares funny meme on new years resolution netizens relate
  • మొదలు పెట్టిన మూడు రోజులకే ముగింపు
  • మాటల్లో కాదు ఆచరణ ముఖ్యమన్న సంకేతం
  • 24 గంటల్లోనే 11 లక్షల మంది వీక్షణ
60 సెకండ్లు గడిస్తే నిమిషం. 60 నిమిషాలు గడిస్తే గంట. 24 గంటలు గడిస్తే రోజు. 365 రోజులు గడిస్తే ఏడాది. ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. మార్పు కోసం, మంచి కోసం, సానుకూల ఫలితాలను సాధించేందుకు కొత్త ఏడాదే కానక్కర్లేదు. జనవరి 1 వరకు వేచి చూడక్కర్లేదు. కానీ, కొంత మంది కొత్త సంవత్సరం సందర్భంగా తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. పోనీ అనుకున్నవి ఆచరిస్తారా? అంటే సందేహమే.

నేను ఇక నుంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, అనవసర ఖర్చులు చేయకూడదు, కొత్త సంవత్సరంలో ప్రతి రోజూ అరగంట వ్యాయామం చేయాలి, నిత్యం యోగా చేయాలి.. ఇలాంటివే కొన్ని తీర్మానాలు. కానీ, అనుకున్నవి ఆచరణలో పెట్టే వారు తక్కువే. కొందరు అనుకున్నవి మొదలు పెట్టి మధ్యలో వాటిని ముగించేస్తుంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్ కు సంబంధించి ఆలోచింపజేసే ఓఫన్నీ ట్వీట్ ను ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్ల కోసం తెచ్చారు. దీనికి యూజర్లు సైతం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. శుక్రవారం ఈ పోస్ట్ పెట్టగా, ఇప్పటికే 11 లక్షల మంది చూసేశారు.
new years resolution
Anand Mahindra
funny tweet

More Telugu News