నేడు తొలి టీ20... టీమిండియాపై టాస్ గెలిచిన శ్రీలంక

Sri Lanka won the toss against Team India in 1st T20
  • టీమిండియా, శ్రీలంక మధ్య 3 టీ20ల మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ కు వాంఖెడే స్టేడియం ఆతిథ్యం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
నేటి నుంచి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ షురూ అవుతోంది. తొలి మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులో శుభ్ మాన్ గిల్, శివమ్ మావి అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నారు. టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. 

టీమిండియా...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చహల్.

శ్రీలంక...
దసున్ షనక (కెప్టెన్), పత్తుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక.
Go Back to Shorts
Team India
Sri Lanka
Toss
1st T20
Mumbai

More Telugu News