Anam Ramanarayana Reddy: ముందస్తు అంటున్నారు... అదే నిజమైతే ఏడాది ముందే ఇంటికెళ్లడం ఖాయం: ఆనం సంచలన వ్యాఖ్యలు

YCP MLA Anam Ramanarayana Reddy sensational comments
  • ఇటీవల ఆనం నుంచి అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు!
  • రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడి
  • ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తికాలేదని ఆవేదన
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల తరచుగా అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు... అదే నిజమైతే ఏడాది ముందే ఇంటికెళ్లడం ఖాయమని అన్నారు. 

ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలా, బిల్లుల చెల్లింపు జాప్యమా... తెలియడంలేదు, కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడంలేదో అర్థంకావడంలేదు అని వ్యాఖ్యానించారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తిచేస్తామంటున్నారని, కానీ అవి పూర్తయ్యేలోపు తమ పదవీకాలం పూర్తవుతుందని అన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాలు లేకపోతే ఎక్కడ కూర్చుని పనిచేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆనం విమర్శించారు. 

కాగా, ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆనం స్థానంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశాలున్నట్టు సమాచారం.
Anam Ramanarayana Reddy
YSRCP
Venkatagiri
Andhra Pradesh

More Telugu News