Gudivada Amarnath: అవసరమైతే పవన్ తో ఆ సినిమా నేనే తీస్తా: మంత్రి గుడివాడ అమర్నాథ్

AP minister Gudivada Amarnath take a swipe at Pawan Kalyan
  • పవన్ కు 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవన్న అమర్నాథ్
  • ఇలాంటి వ్యక్తి సీఎం కాలేడని కామెంట్  
  • 'సీఎం పవన్ కల్యాణ్' అనే సినిమా తీసుకోవాలని వ్యంగ్యం
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్... ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారా? అని మంత్రి వ్యాఖ్యానించారు. పవన్ సినిమాల్లోనే పవర్ స్టార్... రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. 

పవన్ కల్యాణ్ జీవితంలో సీఎం కాలేడని, కనీసం 'సీఎం పవన్ కల్యాణ్' అని సినిమా తీస్తే అభిమానులు చూసి సంతోషిస్తారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒకవేళ అవసరమైతే ఆ సినిమాకు తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని మంత్రి అమర్నాథ్ అన్నారు. 

పవన్ ఎప్పుడూ ఇతరుల కోసం తన పార్టీని ఉపయోగిస్తుంటారని విమర్శించారు. 2014లో చంద్రబాబును గెలిపించాలని భావించి పోటీ చేయలేదని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం బరిలో దిగి ఓడిపోయారని అన్నారు. కనీసం 2024లో అయినా పవన్ 175 సీట్లలో పోటీ చేస్తానని చెప్పగలరా? అంటూ అమర్నాథ్ సవాల్ విసిరారు.
Gudivada Amarnath
Pawan Kalyan
Cinema
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News