Anjali: 'ఝాన్సీ' సీజన్ 2 నుంచి ట్రైలర్ రిలీజ్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!

  • హాట్ స్టార్ నుంచి వచ్చిన 'ఝాన్సీ వెబ్ సిరీస్
  • ఆసక్తిని రేకెత్తిస్తూ కొనసాగిన 6 ఎపిసోడ్స్ 
  • ఈ నెల 19 నుంచి సీజన్ 2 మొదలు 
  • ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్  
Jhansi Season 2 Trailer Released

తాను ప్రధాన పాత్రగా అంజలి 'ఝాన్సీ' వెబ్ సిరీస్ చేసింది. కొంతకాలం క్రితం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేశారు. సీజన్ 1లో మొత్తం 6 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. అంజలితో పాటు చాందినీ చౌదరి .. ఆదర్శ్ బాలకృష్ణ .. తాళ్లూరి రామేశ్వరి ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఒక జలపాతంలో పడి కొట్టుకుపోతూ .. అక్కడి గిరిజనులకు ఒక యువతి దొరుకుతుంది. అయితే ఆమెకి గతం గుర్తుండదు. ఆ అడవికి వచ్చిన ఒక పాపను ఆ యువతి కాపాడుతుంది. ఆ పాపనే ఆమెకి ఝాన్సీ అని పేరు పెడుతుంది. ఆ ఫ్యామిలీతో నగరానికి వచ్చిన ఝాన్సీ .. తన అసలు పేరు 'మహిత' అని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి తన గతాన్ని అన్వేషించే పనిలో పడుతుంది. 

మొదటి 6 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తాయి. ఆ తరువాత ఎపిసోడ్స్ ను సీజన్ 2 గా హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా వదిలారు. సీజన్ 2లో ఏం జరగనుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ ట్రైలర్ సాగుతోంది.

More Telugu News