Guntur: గుంటూరు మృతులకు రూ.20 లక్షల సాయం ప్రకటించిన ఉయ్యూరు ఫౌండేషన్

Uyyuru Foundation announces 15 lakhs to deceased in Guntur stampede
  • గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
  • కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉయ్యూరు ఫౌండేషన్
  • పంపిణీ సందర్భంగా తొక్కిసలాట
  • ముగ్గురు మహిళల మృతి
గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా అనే మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

ఈ నేపథ్యంలో, ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు.
Guntur
Stampede
Women
Death
Uyyuru Srinivasarao
Uyyuru Charitable Foundation

More Telugu News