Raghu Rama Krishna Raju: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju says there will be a chance of early elections in AP
  • జగన్ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం చూస్తోందన్న రఘురామ
  • ప్రభుత్వ పథకాలకు తగినన్ని నిధులు లేవని వ్యాఖ్యలు
  • ముందస్తు ఎన్నికలు తప్ప మరో మార్గం లేదని వెల్లడి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ రాజకీయాలపై స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త అప్పులకు జగన్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని, ఏపీలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా వైసీపీ ప్రభుత్వానికి వేరే ఆప్షన్ కనిపించడంలేదని రఘురామ వివరించారు. 

జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మాట తప్పడం ద్వారా జగన్ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రజల పట్ల తన వైఖరి మార్చుకోవాలని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నట్టు రఘురామ తెలిపారు.
Raghu Rama Krishna Raju
Early Elections
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News