టీడీపీతో పొత్తు ఉంటుందా? అన్న విజయశాంతి ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం ఇదే!
- తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రచారం
- ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అడిగిన విజయశాంతి, అర్వింద్
- పొత్తు ఉండదని తెలిపిన బండి సంజయ్
ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని విజయశాంతి, ఎంపీ అర్వింద్ తదితరులు అడిగారు. దీనికి సమాధానంగా టీడీపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే నిజామాబాద్, వరంగల్ లలో టీడీపీ బహిరంగసభలు జరగనున్న తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.