Malavika Nair: అందాల జలపాతం .. మాళవిక నాయర్: లేటెస్ట్ పిక్స్!

Malavika Nair Special
  • అందం .. అభినయం మాళవిక నాయర్ సొంతం 
  • 'థ్యాంక్యూ' సినిమాలో ఆమె ట్రాక్ హైలైట్
  • తెలుగులో ఆశించిన స్థాయిలో దక్కని అవకాశాలు
  • అయినా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్  
ముందుగా మలయాళ సినిమాల్లో మంచి పేరును సంపాదించుకుని ఆ తరువాత టాలీవుడ్ కి పరిచయమైన అందమైన కథానాయికలలో 'మాళవిక నాయర్' ఒకరు. ఆమె పేరు చెప్పగానే విశాలమైన కళ్లు .. వాటితో ఆమె చేసే విన్యాసాలు గుర్తొస్తాయి. ఆకర్షణీయమైన ఆమె నవ్వు పడుచు మనసులకు రెక్కలు తొడుగుతుంది. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలికించగల కథానాయికల జాబితాలో ఆమె కూడా కనిపిస్తుంది. అలాంటి మాళవిక నాయర్ లేటెస్ట్ పిక్స్ ను ఇప్పుడు కుర్రమనసుల వాకిట్లో గుమ్మరించారు. రెడ్ కలర్ డ్రెస్ లో ఆమె పడుచు పాలరాతి శిల్పంలా కనిపిస్తోంది. అందాల జలపాతమై కుర్రకారు మనసులను తాకుతోంది. అలాంటి మాళవిక నాయర్ ను చూస్తే ఆమెకి ఇక్కడ రావాల్సినన్ని అవకాశాలు .. గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది. 'థ్యాంక్యూ' సినిమాలో ఆమె ట్రాక్ హైలైట్ అయింది. అయితే సినిమా ఫ్లాప్ కావడం వలన ఆమె గురించిన చర్చ ఎక్కడా రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'అన్నీమంచి శకునములే' సినిమా ఉంది. నాగశౌర్యతో కూడా ఒక సినిమా ఉందిగానీ, అందుకు సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు. అందం .. అభినయం విషయంలో మాళవిక నాయర్ కి వంకబెట్టవలసిన పనిలేదు. మంచి కథలు .. స్టార్ హీరోల జోడీగా అవకాశాలు వస్తే, అందుకోవడానికీ .. పుంజుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోని టాలెంట్ ఆమెకి ఉంది. కొత్త ఏడాదైనా ఆమెకి కలిసొస్తుందేమో చూడాలి.
Malavika Nair
Actress
Tollywood

More Telugu News