జగన్ పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని విమర్శ
  • రూ. 3 లక్షల కోట్లను దోపిడీ చేశారని ఆరోపణ
  • ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని మండిపాటు
120 YSRCP MLAs are unhappy with Jagan says Gorantla Butchaiah Chowdary

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తద్వారా స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి మోసం చేశారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ రూ. 3 లక్షల కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు. జగన్ పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. జనాల్లోకి రాలేని స్థితిలో జగన్ ఉన్నారని... పోలీసులను అడ్డు పెట్టుకుని ఎంతకాలం దాక్కుంటారని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కడం తప్ప ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని అన్నారు.  

మూడున్నరేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని, ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించలేదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. జగన్ పాలన మొత్తం మోసమేనని... పోలవరం ఎత్తును తగ్గించి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆరు లక్షల పింఛన్లను కట్ చేశారని దుయ్యబట్టారు. గాల్లో వచ్చిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గాల్లోనే కొట్టుకుపోతారని చెప్పారు.

More Telugu News