విమానంలో కొట్టుకున్న వారిపై కేసు.. అలాంటి ప్రవర్తన తగదన్న కేంద్ర మంత్రి సింధియా
- ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ
- అనంతరం కొట్లాట
- కేసు నమోదు చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకటన
- రంగంలోకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ
గత మంగళవారం ఇద్దరు ప్రయాణికులు వాగ్వివాదానికి దిగగా, వారిని నిలువరించేందుకు హెయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నం విఫలమైంది. అనంతరం ఒక ప్రయాణికుడిని తోటి ప్రయాణికులు చుట్టుముట్టి ముఖంపై కొట్టారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని, ఏవియేషన్ సెక్యూరిటీ బాధ్యతలు చూసే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది.