kandukuru accident: చంద్రబాబు అధికారదాహమే కారణం.. కందుకూరు ప్రమాదంపై మంత్రి కాకాణి

ap minister kakani fires on chandrababu
  • ఇరుకు సందులో సభ పెట్టడంపై మంత్రి మండిపాటు
  • సభకు వచ్చిన జనాన్ని ఎక్కువగా చూపించేందుకు ప్రయత్నం
  • లేనిది ఉన్నట్టుగా చూపేందుకు ఓ టీమ్ ను పెట్టుకున్నాడని విమర్శ
ఇరుకు సందులో సభ పెట్టి, వచ్చిన జనాలను ఎక్కువగా చూపించుకునే ప్రయత్నం వల్లే కందుకూరులో తొక్కిసలాట జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబు అధికార దాహమే కారణమని విమర్శించారు. తన రాజకీయ దాహం తీర్చుకోవడానికి చంద్రబాబు ఇంకా ఎంతమంది ప్రాణాలు బలితీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు.

కందుకూరు ప్రమాద ఘటనపై మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ఆత్మీయులను కోల్పోయిన ఆ కుటుంబాల గోస తప్పకుండా చంద్రబాబుకు తగులుతుందని మంత్రి చెప్పారు. గతంలో పుష్కరాల సందర్భంగా 29 మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు.

లేనిది ఉన్నట్టుగా, వచ్చిన జనాన్ని భారీగా చూపించేలా చేయడానికి చంద్రబాబు దగ్గర ప్రత్యేకంగా ఓ బృందం ఉందని మంత్రి కాకాణి చెప్పారు. చంద్రబాబు సభలకు జనం ఎక్కువగా రాకపోవడంతో వచ్చిన ఆ కాస్త జనాన్నే ఎక్కువగా చూపించేందుకు ఈ టీమ్ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఇరుకు సందుల్లో సభ పెట్టడం వల్ల డ్రోన్ కెమెరాలో జనం ఎక్కువగా వచ్చినట్లు కనిపిస్తారని చంద్రబాబు ప్రతీ సభనూ ఇలాంటి చోటనే పెడుతున్నారని ఆరోపించారు. ఆయన అధికార దాహమే కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలను బలి తీసుకుందని మండిపడ్డారు.
kandukuru accident
tdp
Chandrababu
YSRCP
minister kakani

More Telugu News