కందుకూరులో చంద్రబాబు సభ వద్ద అపశ్రుతి

Minor incident at Chandrababu Kandukur rally
  • నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
  • రద్దీ కారణంగా తీవ్ర తొక్కిసలాట 
  • స్పృహ కోల్పోయిన పలువురు
  • ఆసుపత్రికి పంపే ఏర్పాట్లు చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా కందుకూరు విచ్చేశారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కందుకూరులో రోడ్లు క్రిక్కిరిసి పోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. 

విపరీతమైన రద్దీ నెలకొనడంతో కార్యకర్తల మధ్య తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

 ఇది బాధాకరమైన ఘటన అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, వారు క్షేమంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. ఈ ఘటన కారణంగా కందుకూరులో చంద్రబాబు ప్రసంగం ఆలస్యమైంది. బాధితుల పరిస్థితి తెలుసుకున్నాకే ప్రసంగిస్తానంటూ చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల కోసం సభను తాత్కాలికంగా నిలిపివేసిన చంద్రబాబు ఆసుపత్రికి తరలి వెళ్లారు. కార్యకర్తల పరిస్థితిని సమీక్షించి సభపై నిర్ణయం తీసుకుందామని నేతలకు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Kandukur
TDP
Nellore District

More Telugu News