మధురై ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందిపై మండిపడిన సిద్ధార్థ్ 

  • తల్లిదండ్రులతో కలిసి మధురై ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్
  • భద్రతా సిబ్బంది వేధించారన్న సిద్ధార్థ్
  • 20 నిమిషాల పాటు దురుసుగా ప్రవర్తించారని వెల్లడి
Siddharth fires on Madurai airport security personnel

దక్షిణాది నటుడు సిద్ధార్థ్ కు మధురై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే మధురై ఎయిర్ పోర్టులో భద్రతా సిబ్బంది వేధించారని సిద్ధార్థ్ ఆరోపించారు. తన తల్లిదండ్రుల బ్యాగ్ లు తనిఖీ చేస్తూ అందులోని వస్తువులన్నీ తీయాలని చెప్పారని, వాళ్ల వయసును పరిగణనలోకి తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాళ్లు హిందీలోనే మాట్లాడుతుండడంతో, తాను ఇంగ్లీషులో మాట్లాడాలని కోరానని, అయినా సరే వాళ్లు హిందీలోనే మాట్లాడారని వివరించారు. ఇలా 20 నిమిషాల పాటు వాళ్ల దురుసు ప్రవర్తన కొనసాగిందని, ఇదేంటని ప్రశ్నిస్తే భారత్ లో ఇలాగే ఉంటుందని బదులిచ్చారని సిద్ధార్థ్ మండిపడ్డారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ బహిరంగ లేఖ రాశారు.

More Telugu News