కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్
- నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న జగన్
- మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో భేటీ
- రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చర్చించనున్న ముఖ్యమంత్రి
మరోవైపు జగన్ తో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఇదిలావుంచితే, ఈ నెల మొదటి వారంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశానికి జగన్ హాజరైన సంగతి తెలిసిందే.