Chiranjeevi: బాబీని హగ్ చేసుకుని ఫొటో తీయమన్న మెగాస్టార్!

Waltair Veerayya movie Press Meet
  • 'వాల్తేరు వీరయ్య'కు దర్శకత్వం వహించిన బాబీ 
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ 
  • తాను చిరంజీవి అభిమానినన్న బాబీ
  • ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఆనందం
చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య' సినిమాను రూపొందించాడు. జనవరి 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో బాబీ మాట్లాడుతూ .. "చిన్నికృష్ణ అనే ఒక రైటర్ చిరంజీవి గారికి హిట్ ఇచ్చారని తెలిసి, నేను కూడా చిరంజీవిగారితో సినిమా చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చేశాను. ఆ రోజున గీతా ఆర్ట్స్ బయటనున్న 50 మంది అభిమానుల్లో నేను ఒకడిని" అని చెప్పాడు. 

"ఆ రోజున అందరూ బ్లడ్ ఇస్తున్నారు .. నేను కూడా లోపలికి వెళ్లాను. నేను బాగా సన్నగా ఉండటంతో కళ్లు తిరిగి పడతానని జాలేసి వద్దని చెప్పారు. ఆ తరువాత చిరంజీవిగారితో ఫొటో దిగాలి అన్నారు. చిరంజీవిగారు కారు దిగి వస్తుంటే ఫస్టు టైమ్ చూశాను. చిరంజీవిగారితో 50 మంది అభిమానులం కలిసి చాల సంతోషంగా ఒక ఫొటో దిగాము. ఆ వెంటనే చిరంజీవిగారితో మరో ఫొటో దిగడానికి వెళ్లాను. ఆయన నన్ను గుర్తుపట్టేశారు. అటు చూడు అని కాస్త కోపంగా కెమెరా వైపు చూపించారు.

చిరంజీవిగారితో కలిసి హ్యాపీగా దిగిన ఫొటో రాలేదు. కానీ ఆయన నాపై కోప్పడిన ఫోటో వచ్చింది. ఎప్పటికైనా నాతో కలిసి ఆయన నవ్వుతున్నప్పుడు ఫొటో తీయించుకోవాలని ఉండేది" అని అన్నాడు. ఆ మాట అనగానే చిరంజీవి వచ్చి బాబీని హగ్ చేసుకుని నవ్వుతూ .. 'ఇప్పుడు తీయండి ఫొటో" అన్నారు. దాంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. బాబీ ఆయన పాదాలకి నమస్కారం చేశాడు.
Chiranjeevi
Sruthi Haasan
Raviteja
Bobby

More Telugu News