Popua New Guinea: ప్రపంచంలో అత్యధికంగా భాషలు ఈ చిన్న దేశంలో ఉన్నాయట!

  • ఎత్నోలాగ్-2022 పేరిట జాబితా
  • టాప్-10 జాబితా విడుదల చేసిన వరల్డ్ ఇండెక్స్
  • 840 భాషలతో పాపువా న్యూగినియాకు ప్రథమస్థానం
  • నాలుగో స్థానంలో 456 భాషలతో భారత్ 
Popua New Guinea has the most languages in the world

వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరిట ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల టాప్-10 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పాపువా న్యూగినియాలో 840 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ వెల్లడించింది. పాపువా న్యూగినియా జనాభా కేవలం 93 లక్షలే. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో తెగలు ఇక్కడ జీవిస్తుండడంతో ఇన్ని భాషలు వాడుకలో ఉన్నాయి.

ఇక ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఇండోనేషియా నైజీరియా ఉన్నాయి. ఇండోనేషియాలో 715 భాషలు, నైజీరియాలో 527 భాషలు ఉన్నాయి. 

భారత్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ లో 456 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అమెరికా (337), ఆస్ట్రేలియా (317), చైనా (307), మెక్సికో (301), కామెరూన్ (277), బ్రెజిల్ (238) దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News