Vallabhaneni Balashouri: కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులుగా ఎంపీలు బాలశౌరి, ధర్మపురి అర్వింద్

  • సెంట్రల్ స్పైసెస్ బోర్డులో తెలుగు ఎంపీలకు స్థానం
  • ఇటీవల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
  • నామినేషన్ వెనక్కి తీసుకున్న హిబీ ఈడెన్
  • బరిలో మిగిలిన అర్వింద్, బాలశౌరి
Vallabhaneni Balashouri and Dharmapuri Arvind elected as Central Spices Board members

కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు (సెంట్రల్ స్పైసెస్ బోర్డు) సభ్యులుగా తెలుగు ఎంపీలు ధర్మపురి అర్వింద్, వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. వల్లభనేని బాలశౌరి, ధర్మపురి అర్వింద్ ఇరువురు లోక్ సభ సభ్యులు. బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ. 

కాగా, సుగంధ ద్రవ్యాల బోర్డుకు ఇటీవల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా, నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ధర్మపురి అర్వింద్, వల్లభనేని బాలశౌరి, కేరళ కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ లు బరిలో మిగిలారు. అయితే, హిబీ ఈడెన్ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో, ఎన్నికలతో పనిలేకుండా పోయింది. బరిలో మిగిలిన ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.

More Telugu News