Chiranjeevi: సంక్రాంతికి మెగా హిట్ ఖాయం: రాజేంద్ర ప్రసాద్

Waltair Veerayya movie Press Meet
  • 'వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ 
  • తన చిరకాల మిత్రుడు చిరంజీవి అంటూ ప్రశంసలు
  • ఆయనతో మరోసారి కలిసి నటించడం పట్ల హర్షం  
  • పాత్రలకి తగిన నటులను ఎంచుకున్నారని వ్యాఖ్య 
చాలా కాలం తరువాత చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రెస్ మీట్ కూడా ఘనంగా నిర్వహించారు. రవితేజ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ ముఖ్యమైన పాత్రను పోషించారు. 

ఈ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. " ఒక ప్రెస్ మీట్ ఇంత అద్భుతంగా ఉండటం ఎవరూ చూసుండరు. మెగా ఈవెంట్స్ అన్నీ కూడా మెగా వల్లనే అవుతాయి. ఈ కంటెంట్ వినగానే మెగా హిట్ తప్పదు అనే విషయం నాకు అర్థమైపోయింది. ఏయే పాత్రలను ఎవరెవరు వేయాలో వారే వేశారు. అందువల్లనే ఇది ఒక అద్భుతమైన సినిమా అని చెబుతున్నాను" అన్నారు. 

"నేను ఒక పాత్రను చేస్తుండగానే నాకు నచ్చేసిన సినిమా ఈ మధ్య కాలంలో ఇదే. 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ తో చిరంజీవిగారు చేయడానికి సిద్ధమైనప్పుడే ఈ సినిమా హిట్. దానికి మిగతా అంశాలను జోడించారు. నా మిత్రుడు చిరంజీవిగారితో కలిసి మరోసారి యాక్ట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. సంక్రాంతికి మళ్లీ మెగా హిట్ పడటం ఖాయం" అంటూ చెప్పుకొచ్చారు.
Chiranjeevi
Sruthi Haasan
Rajendra Prasad
Waltair Veerayya Movie

More Telugu News