Corona Virus: భారత్ లో 11 శాతం పెరిగిన కరోనా కేసులు

  • చైనా తదితర దేశాల్లో మరోసారి కరోనా ఉద్ధృతి
  • భారత్ లో సాధారణ పరిస్థితులు
  • కొద్దిమేర పెరిగిన కేసులు
Corona cases rises in country

చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి ఊపందుకున్న నేపథ్యంలో, భారత్ లోనూ కలకలం మొదలైంది. పలు దేశాలతో పోల్చితే భారత్ లో మెరుగైన పరిస్థితులు ఉన్నప్పటికీ, వారం రోజుల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 11 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో ఫోర్త్ వేవ్ కు ఇది సంకేతమా అనేదానిపై స్పష్టత లేదు. 

కరోనా వైరస్ జన్యురూపాంతరం చెంది సబ్ వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందడం సహజంగా జరిగే ప్రక్రియ అని, దీనిపై కొత్త వేరియంట్ పై ఇప్పుడే అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. 

ఇక, చైనాలో కొత్త కేసులు లక్షల్లో వస్తుండడంతో భారత్ లోనూ కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేయడం తెలిసిందే. పలు రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేస్తున్నాయి.

More Telugu News