తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత పొలంలో సందడి చేశారు. కూలీలతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నారు పీకారు. మంత్రి ఎర్రబెల్లి స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి. గ్రామంలో ఆయనకు సొంత పొలాలు ఉండడంతో, అక్కడి వ్యవసాయ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వరి నారుమడిలో నారు పీకి కట్టలు కట్టారు. అరక దున్ని సేద్యం చేశారు. తద్వారా వ్యవసాయంపై తన మమకారాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.