పొలిటికల్ ఎంట్రీపై నటి త్రిష స్పందన

  • ఇటీవల త్రిష నటించిన పొన్నియిన్ సెల్వన్ రిలీజ్
  • కొత్త సినిమాలకు నో చెబుతున్న త్రిష
  • పొలిటికల్ ఎంట్రీ కోసమేనంటూ ప్రచారం
  • తనకు రాజకీయాలు నచ్చవంటూ స్పష్టత నిచ్చిన త్రిష
Trisha condemns political entry speculations

దక్షిణాది నటి త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రిలీజ్ కాగా, ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా, ఆమె తిరస్కరించారు. త్రిష రాజకీయాల్లోకి వెళుతున్నందునే ఈ సినిమాలను అంగీకరించలేదంటూ ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై త్రిష స్పందించారు. తన కొత్త చిత్రం 'రాంగీ' ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్న త్రిష మీడియాతో మాట్లాడుతూ... జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. తనకసలు రాజకీయాల గురించి ఏమాత్రం తెలియదని స్పష్టం చేశారు. తన పొలిటికల్ ఎంట్రీ అంటూ వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు తనకు నచ్చవని త్రిష పేర్కొన్నారు.

More Telugu News