Telangana: బూస్టర్ డోస్ కోసం తెలంగాణలో ఒక్కసారిగా అనూహ్య డిమాండ్

400 percent jump in booster jabs in Telangana within 72 hours
  • గత మూడు రోజుల్లో 400 శాతం అధికంగా ప్రజలు రాక
  • క్రిస్ మస్ రోజున సైతం క్యూ కట్టిన ప్రజలు
  • దేశంలో అత్యధికంగా బూస్టర్ డోసులు తీసుకున్నది తెలంగాణలోనే
కరోనా టీకా బూస్టర్ డోస్ కోసం తెలంగాణలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. చైనాలో లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడుతూ, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఐసీయూల్లో చేరుతుండడం, కేంద్ర సర్కారు ముందస్తు హెచ్చరికలే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదనే ఆలోచనతో ప్రజలు బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసుపత్రులకు వస్తున్నారు. 

గడిచిన 72 గంటల్లో బూస్టర్ డోస్ కోసం వచ్చే వారి సంఖ్య.. అంతకుముందు రోజువారీ సగటుతో పోలిస్తే 400 శాతం పెరిగినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. క్రిస్ మస్ రోజు కూడా ప్రజలు బూస్టర్ డోస్ కోసం ఆసక్తి చూపించారు. ఈ నెల 21న 646 మంది బూస్టర్ డోస్ తీసుకుంటే, మరుసటి రోజు 22న 1,631 మంది బూస్టర్ టీకా కోసం వచ్చారు. 23న 2,267 మంది, 24న 3,380 మంది, క్రిస్ మస్ రోజున 1,500 మంది (పండుగ కావడంతో తగ్గింది) బూస్టర్ డోస్ తీసుకున్నారు. సాధారణ రోజుల్లో బూస్టర్ డోస్ తీసుకునే వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది. ఇక దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 46 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. 

Telangana
corona vaccine
booster jabs
demand

More Telugu News