చలపతిరావు అకాల మరణం కలచివేసిందన్న చిరంజీవి, బాలకృష్ణ

  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రకటన
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తీకరణ
  • నాన్నగారితో, తనతో ఎన్నో సినిమాల్లో నటించారన్న బాలకృష్ణ
balakrishna and chiranjeevi reaction on chalapathi rao demise

ప్రముఖ నటుడు చలపతిరావు గుండె పోటుతో మరణించడం పట్ల చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి చెందారు. చలపతిరావు అకాల మరణం తమను కలచివేసిందన్నారు. చిరంజీవి స్పందిస్తూ.. చలపతిరావు గారి మరణం తనను కలచివేసిందన్నారు. విలక్షణమైన నటుడిగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

తమ కుటుంబానికి చలపతిరావుతో మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. ‘‘చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలచి వేసింది. ఆయన తన విలక్షమైన నటనతో తెలుగు వారిని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలు తీశారు. నాన్నగారి (ఎన్టీఆర్)తో కలసి ఎన్నో సినిమాల్లో నటించారు. నా సినిమాల్లోనూ చలపతిరావు గారు నటించారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి’’అని బాలకృష్ణ పేర్కొన్నారు.

చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు చాలా మంది చలపతిరావు మరణం తీరని లోటుగా పేర్కొంటున్నారు.

More Telugu News