AirAsia India: కొత్త సంవత్సరం సందర్భంగా.. చౌక ధరలకే విమాన ప్రయాణం

AirAsia India launches New Year New Deals sale with fares starting at Rs 1497
  • దేశీ సర్వీసుల్లో రూ.2023కే టికెట్లను విక్రయిస్తున్న ఇండిగో
  • అంతర్జాతీయ సర్వీసుల్లో రూ.4,999 నుంచి ఆరంభం
  • రూ.1,497కే టికెట్ ను ఆఫర్ చేస్తున్న ఎయిరేషియా
నూతన సంవత్సరం సందర్భంగా ఎయిర్ లైన్స్ కంపెనీలు విమాన ప్రయాణికులకు చౌక ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్ వాటా పరంగా మొదటి స్థానంలో ఉన్న ఇండిగో ఎయిర్ లైన్స్ దేశీ, విదేశీ విమాన సర్వీసుల టికెట్లపై ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్లతో కూడిన డిస్కౌంట్ సేల్ 25వ తేదీ వరకే (ఆదివారం వరకే) అమల్లో ఉంటుంది.

2023 సంవత్సరం ఆగమనం సందర్భంగా రూ.2023కే ఒక్కో టికెట్ ను ఇండిగో అందిస్తోంది. దేశీ విమాన సర్వీసుల్లో టికెట్లను రూ.2023కు, విదేశీ సర్వీసుల్లో టికెట్లను రూ.4,999 నుంచి అందిస్తోంది. ఈ డిస్కౌంట్ సేల్ లో భాగంగా 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ప్రయాణాలపై ఆఫర్లను వినియోగించుకోవచ్చు. 

ఎయిరేషియా ఇండియా సైతం న్యూ ఇయర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. బెంగళూరు-కోచి తదితర మార్గాల్లో రూ.1,497కే టికెట్లను విక్రయిస్తోంది. డిసెంబర్ 25వ తేదీ వరకు చేసుకునే బుకింగ్ లపైనే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ప్రయాణ టికెట్లపై ఈ ఆఫర్లు పొందొచ్చు. ఎయిరేషియా పోర్టల్, మొబైల్ యాప్, ఇతర బుకింగ్ సైట్లలో బుకింగ్ లపై ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
AirAsia India
New Year sale
Rs 1497
Indigo
discount sale

More Telugu News