అధికారిక లాంఛనాలతో.. కైకాల అంత్యక్రియలు పూర్తి

LAST RITES OF KAIKALA SATYANARAYANA ARE COMPLETE HYDERABAD
  • జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • అంతిమ సంస్కారాలు నిర్వహించిన కైకాల పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ
  • కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు, అభిమానులు
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కైకాలను అధికారిక లాంఛనాలతో సగౌరవంగా సాగనంపింది. కైకాల అంతిమ సంస్కారాలను ఆయన పెద్దకొడుకు లక్ష్మీనారాయణ నిర్వహించారు. హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రాజకీయ నేతలు, అభిమానులు కైకాల సత్యనారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు. 

అంతకుముందు ఫిల్మ్‌నగర్‌లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. పూలతో అలంకరించిన వాహనంలో ఆయన పార్థివదేహంతో యాత్రగా మహాప్రస్థానానికి సాగారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు రథం వెంట అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు చిరంజీవి, సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కైకాల అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
Go Back to Shorts
kaikala last rites
mahaprashanam
kaikala

More Telugu News