Chanda Kochhar: చందా కొచ్చర్, ఆమె భర్తను అరెస్ట్ చేసిన సీబీఐ

Chanda Kochhar and her Husband Arrested In Loan Fraud Case
  • వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో ఫ్రాడ్ కేసు
  • ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో హోదాలో రూ.3,250 కోట్ల రుణాలను మంజూరు చేసిన చందా
  • కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందన్న సీబీఐ
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. 

కేసు వివరాల్లోకి వెళ్తే బ్యాంక్ సీఈవో హోదాలో 2012లో వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3,250 కోట్ల రుణాన్ని చందా కొచ్చర్ మంజూరు చేశారు. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ఈ వ్యవహారం ద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది.
Chanda Kochhar
Husband
Arrest
CBI
Loan Fraud Case

More Telugu News