ముగిసిన రెండో రోజు ఆట... భారత్ కు 87 పరుగుల ఆధిక్యం
- ఢాకాలో రెండో టెస్టు
- టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్
- తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 రన్స్
- 314 పరుగులు చేసిన టీమిండియా
- రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్
అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేజార్చుకున్నారు. పంత్ 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 93 పరుగులు చేయగా, అయ్యర్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 159 పరుగులు జోడించడం విశేషం.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4, కెప్టెన్ షకీబల్ హసన్ 4 వికెట్లు పడగొట్టారు. తస్కిన్ అహ్మద్ 1, మెహిదీ హసన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.