WhatsApp: వాట్సాప్ యూజర్లకు కొన్ని సూపర్ ట్రిక్స్

  • పొరపొటుగా సందేశాలు డిలీట్ అయిపోయినా రికవరీ చేసుకోవచ్చు
  • ఆన్ లైన్ లోకి ఎప్పుడు వచ్చారన్నది కూడా తెలియకుండా చేసుకోవచ్చు
  • వాయిస్ మెస్సేజ్ లు పెద్దవి పంపుకోవడం సులభం
useful WhatsApp tricks and tips you mus try out

వాట్సాప్ లోకి మీరు ఎప్పుడు వచ్చి వెళ్లారనే విషయం ఇతరులకు తెలియకూడదని అనుకుంటే.. సెట్టింగ్స్ లో ప్రైవసీ ఆప్షన్ కు వెళ్లాలి. అక్కడ లాస్ట్ సీన్ ఆన్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని నోబడీ అని ఎంపిక చేసుకోవాలి. దీంతో ఇతరులకు మన ఉనికి తెలియదు. అలాగే, ఇతరులు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారన్నది మనకు కూడా తెలియదు. వద్దనుకున్నప్పుడు తిరిగి పాత సెట్టింగ్స్ ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

వాట్సాప్ లో సందేశాలను డిలీట్ చేస్తుంటాం. పొరపాటున కావాల్సిన మెస్సేజ్ ను కూడా డిలీట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇలా డిలీట్ చేసిన తర్వాత ఐదు సెకన్ల వరకు తిరిగి దాన్ని అన్ డూ చేసుకునే ఆప్షన్ వాట్సాప్ లో ఉంటుంది. అన్ డూ సెలక్ట్ చేస్తే డిలీట్ చేసినవన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఒకవేళ ఈ సమయం దాటిపోయినా రికవరీ చేసుకోవచ్చు. గెట్ డిలీటెడ్ మెస్సేజెస్ అనే యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. డిలీట్ చేసిన సందేశాల వివరాలు ఈ యాప్ లో ఉంటాయి. 

వాట్సాప్ లో వాయిస్ మెస్సేజ్ లను ఎక్కువ సమయం పాటు రికార్డింగ్ చేయాలని అనుకునే వారు అందుకోసం ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ లో ఏదైనా కాంటాక్ట్ ను తెరిచినప్పుడు కింది భాగంలో స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంటుంది. దీని ద్వారానే వాయిస్ సందేశం పంపాల్సి ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని పైకి స్క్రోల్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇక అప్పటి నుంచి ఎంత సమయం పాటు అయినా వాయిస్ మెస్సేజ్ ను రికార్డ్ చేయవచ్చు. మధ్యలో కావాలంటే పాస్ చేసుకోవచ్చు. మధ్యలో కనిపించే రెడ్ రంగులోని గుర్తును ప్రెస్ చేస్తే పాస్ అవుతుంది. తిరిగి దాన్నే ప్రెస్ చేస్తే మళ్లీ రికార్డింగ్ మొదలవుతుంది. రికార్డింగ్ చేస్తున్న సందేశం వద్దనుకుంటే అక్కడే ఎడమ చేతి వైపు డిలీట్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. 

ఇక వాట్సాప్ లో వాయిస్ కాల్స్ రికార్డింగ్ చేసుకోవాలని అనుకునే వారు.. క్యూబ్ ఏసీఆర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇది ప్లే స్టోర్ లో ఉంటుంది. ఇన్ స్టాల్ చేసుకుని, కావాల్సిన పర్మిషన్స్ ఇస్తే యాక్టివ్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి అన్ని కాల్స్ ను రికార్డ్ చేస్తుంది. రికార్డింగ్ వివరాలు అదే యాప్ లో కనిపిస్తాయి.

More Telugu News