Bharat Biotech: కరోనా బూస్టర్ డోస్ గా ముక్కులో చుక్కల మందు

Govt approves Bharat Biotech nasal vaccine to be introduced on CoWIN
  • ఆమోదించినట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి మాండవీయ
  • నేటి సాయంత్రానికి కోవిన్ యాప్ లో నమోదు
  • 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా దీన్ని తీసుకునేందుకు అర్హులు
హైదరాబాద్ కు కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ (ముక్కులో వేసే చుక్కల మందు టీకా)కు అనుమతి మంజూరు చేసినట్టు, దీన్ని కోవిన్ యాప్ లో చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. దీన్ని బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని, ముందుగా ప్రైవేటు హాస్పిటల్స్ లో అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. నేటి నుంచి కోవిడ్ టీకాల కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చినట్టు పేర్కొన్నాయి. 

కోవిన్ యాప్ లో నాసల్ టీకాను శుక్రవారం సాయంత్రానికి యాడ్ చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారికంగా దీన్ని ఎవరైనా తీసుకునేందుకు వీలుంటుంది. టీకా సర్టిఫికేషన్ కూడా యాప్ నుంచి తీసుకోవడం సులభమవుతుంది. కరోనా మొదటి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కు అర్హులు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారు అవే కంపెనీ బూస్టర్ టీకాలు తీసుకోవచ్చు. వాటికి బదులు నాసల్ టీకాను కూడా తీసుకోవచ్చు. ఎలాంటి సూదులు అవసరం లేని నాసల్ టీకా పొందేందుకు 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనాకు కోవాగ్జిన్, కొవిషీల్డ్, కోవోవ్యాక్స్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ కార్బోవ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి.
Bharat Biotech
nasal vaccine
covid
corona
cowin

More Telugu News