అంబానీ సొంతమైన ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ’
- ‘మెట్రో’లోని వందశాతం వాటాను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్
- వచ్చే ఏడాది మార్చి నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తి
- పూర్తిగా నగదు రూపంలో జరగనున్న లావాదేవీల ప్రక్రియ
ఆర్ఆర్‌వీఎల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,600కు పైగా చిల్లర విక్రయ కేంద్రాలు నిర్వహిస్తోంది. భారత వర్తక, కిరాణా వ్యవస్థపై తమకున్న అవగాహనకు మెట్రో ఇండియా ఆస్తులను జతచేయడం ద్వారా దేశంలోని చిన్న వ్యాపారాలకు మరింత విలువైన సేవలు అందించేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆర్ఆర్‌వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. కాగా, రిలయన్స్ ఇప్పటికే జస్ట్ డయల్, డంజోలను కొనుగోలు చేసింది. అలాగే, ఐటీసీ, టాటా, అదానీ, పతంజలికి పోటీగా ఇండిపెండెన్స్ పేరుతో ఇటీవల సొంత ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఉత్పత్తులను ఆవిష్కరించింది.