బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు: సజ్జల
- ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి తెలంగాణ యాత్రలను చంద్రబాబు ప్రారంభించారు
- బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు
- పల్నాడులో వైసీపీ బలంగా ఉంది
బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని సజ్జల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పనికట్టుకుని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడులో వైసీపీ బలంగా ఉందని చెప్పారు. విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు.