తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ. 900 కోట్ల జరిమానా విధింపు
- అనుమతులు లేకుండా డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ఎన్జీటీ
- నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానా విధింపు
- గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం
పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.