Chandrababu: ఖమ్మం చేరుకున్న చంద్రబాబు... సభా వేదిక వరకు భారీ ర్యాలీ

Chandrababu rally in Khammam town
  • ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభ
  • పాల్గొననున్న చంద్రబాబు
  • భారీ కాన్వాయ్ తో హైదరాబాదు నుంచి రాక
  • ప్రత్యేక వాహనంలో ర్యాలీ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడి సర్దార్ పటేల్ మైదానంలో టీడీపీ శంఖారావం సభలో ఆయన పాల్గొంటారు. కాగా, ఖమ్మం శివార్లలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు భారీగా ఎదురేగి చంద్రబాబు కాన్వాయ్ కు స్వాగతం పలికాయి. అనంతరం చంద్రబాబు ఓ వాహనం పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావడంతో రోడ్డు క్రిక్కిరిసిపోయింది. చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు నీరాజనాలు పలికారు. పూలు చల్లుతూ తమ ప్రియతమ నేతకు స్వాగతం పలికారు.
Chandrababu
Khammam
Rally
TDP Shankharavam
Kasani Jnaneswar
TDP
Telangana

More Telugu News