KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్

Punjab CM Bhagawant Mann met CM KCR in Pragathi Bhavan
  • తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం
  • ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం
  • బీఆర్ఎస్ పై చర్చ!
  • ఈ నెల 24న హైదరాబాద్ కు పంజాబ్ స్పీకర్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్... పంజాబ్ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి వీణ బొమ్మను బహూకరించారు. అటు, భగవంత్ మాన్ కూడా కేసీఆర్ కు శాలువా కప్పి ఓ కానుక అందజేశారు. 

ఇక, ఈ ఇద్దరు సీఎంలు తమ భేటీలో ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కావడం, పార్టీ కార్యాచరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అటు, పంజాబ్ లో పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. 

కాగా, ఈ నెల 24న పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ తదితరులు కూడా హైదరాబాద్ రానున్నారు. వారు కూడా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
KCR
Bhagawant Mann
Hyderabad
BRS
AAP
Telangana
Punjab

More Telugu News