Ronaldo: అర్జెంటీనా దిగ్గజంపై బ్రెజిల్ సూపర్ స్టార్ ప్రశంసలు

Ronaldo Reacts As Lionel Messi Lifts World Cup Title
  • ఫుట్ బాల్ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న అర్జెంటీనా
  • మెస్సీ ఆటతీరుకు అందరూ సమ్మోహితులయ్యారన్న రొనాల్డో
  • ఒక ఫుట్ బాల్ జీనియస్ కు ఇదొక అద్భుతమైన ఫేర్ వెల్ అని కితాబు
ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అర్జెంటీనా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనా మరోసారి ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. అర్జెంటీనా విజయాన్ని ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ రొనాల్డో స్పందిస్తూ మెస్సీపై ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి ఫుట్ బాల్ కు సంబంధించి అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల మధ్య ఎప్పుడూ వైరమే ఉంటుంది. అయినప్పటికీ అర్జెంటీనాను రొనాల్డో ప్రశంసించారు. అర్జెంటీనా విజయాన్ని బ్రెజిలియన్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశారు.

ప్రపంచకప్ ను మెస్సీ లిఫ్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రత్యర్థి జట్టులోని ఏ ఆటగాడినైనా మెస్సీ తన ఆటతీరుతో కార్నర్ కు పంపించేయగలడని కితాబునిచ్చారు. ఎలక్ట్రిఫయింగ్ ఫైనల్స్ లో మెస్సీ ఆటకు బ్రెజిలియన్సే కాకుండా ప్రపంచంలోని ఎంతో మంది సమ్మోహితులయ్యారని అన్నారు. ఒక ఫుట్ బాల్ జీనియస్ కు ఇదొక అద్భుతమైన ఫేర్ వెల్ అని చెప్పారు. కంగ్రాట్యులేషన్స్ మెస్సీ అని ట్వీట్ చేశారు.
Ronaldo
Brazil
Messi
Argentina

More Telugu News