షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం
- ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు
- కశ్మీరీ పండిట్ హత్యకేసులో ఒకరు, నేపాలీ హత్య కేసులో మరొకరి ప్రమేయం
- ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు
నిందితుల నుంచి ఏకే 47 తుపాకి, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా గాలిస్తుండగా తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.