Vijayawada: విజయవాడలో దారుణం.. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురి అఘాయిత్యం!

Woman gang raped in vijayawada for three days
  • మహిళను తీసుకెళ్లి నిర్బంధించిన నిందితుడు
  • మరో ముగ్గురితో కలిసి అత్యాచారం
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
విజయవాడలో జరిగిన ఓ దారుణం తాజాగా వెలుగు చూసింది. నలుగురు వ్యక్తులు ఓ మహిళను గదిలో బంధించి మూడు రోజులపాటు అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత రాత్రి ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలిపనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17న ఆమెను కానూరు సనత్‌నగర్‌లోని ఓ గదికి తీసుకెళ్లాడు.

అక్కడ అతడి పాటు మరో ముగ్గురు ఆమెపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు సోమవారం ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగు చూసింది. పెనమలూరు పోలీసులకు ఆసుపత్రి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Vijayawada
Crime News
Andhra Pradesh

More Telugu News