Bihar: ప్రారంభానికి ముందే కూలిన బ్రిడ్జి.. రూ. 13 కోట్లు వృథా

Bridge made at a cost of Rs 13 cr collapses before inauguration
  • బెగుసరాయ్‌లో బ్రిడ్జి నిర్మాణం
  • 2017లోనే పూర్తయినా యాక్సెస్ రోడ్డు లేక ప్రారంభానికి నోచుకోని వంతెన
  • ఇటీవల వంతెనపై కనిపించిన పగులు
  • అధికారులు స్పందించే లోపే కూలిన వంతెన
బీహార్‌లోని బెగుసరాయ్‌లో 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. గండక్ నదిపై 206 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జ్ నిర్మించారు. వంతెన ముందుభాగం నిన్న నదిలో కుప్పకూలింది. ముఖ్యమంత్రి నాబార్డ్ పథకం కింద ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. అయితే, యాక్సస్ రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జిని ప్రారంభించలేదు. ఇటీవల ఈ వంతెన ముందుభాగంలో పగులు కనిపించింది. దీనిపై స్థానికులు అధికారులకు లేఖ కూడా రాశారు. వారు స్పందించడానికి ముందే అది కుప్పకూలింది.

2016లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభంకాగా, 2017లో పూర్తయింది. అయితే, బ్రిడ్జిపైకి వెళ్లేందుకు యాక్సెస్ రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జి ప్రారంభోత్సవానికి నోచుకోలేకపోయింది. ఆకృతి టోలా చౌకి-బిషన్‌పూర్ మధ్య దీనిని నిర్మించారు. గత నెలలో బీహార్‌ నలందా జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడు గాయపడ్డాడు. కార్మికుడి మృతిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Bihar
Bridge
Bihar Bridge Collapse
Begusarai

More Telugu News