భారత రక్షణ రంగం మరింత బలోపేతం.. నౌకాదళంలో చేరిన శత్రు భీకర యుద్ధనౌక!
- దేశీయంగా నిర్మితమైన ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’
- నౌకాదళంలో ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడేలా తీర్చిదిద్దిన వైనం
నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ నౌక గంటకు 30 నాట్ల (55 కిలోమీటర్లు)కు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనిని డిజైన్ చేసింది. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఇందులో ముప్పావు వంతు భాగాలు దేశీయంగా తయారైనవే. ఇందులో అధునాతన సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. అలాగే, నిఘా రాడార్ వ్యవస్థ కూడా ఉంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగన లక్ష్యాలపై ఇది క్షిపణులను సంధించగలదు. అంతేకాదు అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడగలిగేలా దీనిని తీర్చి దిద్దారు.