China: చైనాలో కరోనా ఉగ్ర రూపం.. నిర్మానుష్యంగా మారిన రోడ్లు!

Funeral homes overwhelmed in china Covid deaths rised
  • బోసిపోయిన ప్రధాన నగరాల్లోని రోడ్లు
  • రద్దీగా మారిన శ్మశాన వాటికలు
  • చైనా నూతన సంవత్సరం తర్వాత రెండో వేవ్!
ప్రపంచాన్ని దాదాపుగా వదిలిపెట్టిన కరోనా వైరస్ చైనాను మాత్రం పట్టిపీడిస్తోంది. అక్కడ ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిగా దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే, కరోనా మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో శ్మశాన వాటికల వద్ద రద్దీ కూడా భారీగా పెరిగింది.

చైనాలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే చైనా నూతన సంవత్సరం (లూనార్ న్యూ ఇయర్) తర్వాత దేశంలో రెండో వేవ్ వచ్చే అవకాశం ఉందని చైనా చీఫ్ ఎపిడమాలజిస్ట్ వూ జూన్‌యు అంచనా వేశారు. ప్రజాగ్రహం కారణంగా చైనా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత అధికారికంగా మరణాలను నివేదించలేదు. అయితే, శ్మశాన వాటికలు మాత్రం బిజీగా ఉండడాన్ని బట్టి మరణాలు భారీగా సంభవిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.
China
Corona Virus
Corona Deaths
Second Wave

More Telugu News