Vishal: రాజకీయాల్లోకి వస్తానన్న సినీ నటుడు విశాల్.. కుప్పంలో పోటీపై క్లారిటీ!

Coming into politics actor vishal clarifies
  • చంద్రబాబు నాయుడుపై పోటీ చేయబోతున్నట్టు వార్తలు
  • అవి వదంతులు మాత్రమేనన్న విశాల్
  • ప్రజాసేవ కోసం తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానన్న నటుడు
  • ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
ప్రముఖ సినీ నటుడు విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న విశాల్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్‌కు సంబంధించి చెన్నైలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ.. రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పష్టత నిచ్చాడు. 

తనకు సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టమని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని పేర్కొన్నాడు. అయితే, కుప్పం నుంచి చంద్రబాబునాయుడుపై పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు మాత్రం వదంతులేనని తేల్చి చెప్పాడు. ఆ ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉన్న మాట వాస్తవమేనని అన్నాడు. అక్కడ తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసేవారని, మూడేళ్లపాటు తాను అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చాడు. అలాగే, పెళ్లికి సంబంధించి వస్తున్న ఊహాగానాలపైనా స్పందించాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని విశాల్ తేల్చి చెప్పాడు.
Vishal
Tamil Actor Vishal
Chandrababu
Kuppam
Laatti

More Telugu News