Vijayasai Reddy: ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికే ఖర్మ: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy take a swipe at Chandrababu
షార్ట్స్‌లో చూడండి
విపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తాను అధికారంలో లేకపోతే చాలు.... గుడులు, బడులను సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. తానే కక్షలు కార్పణ్యాలు రగిల్చి, మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపిస్తుంటాడని తెలిపారు. 

ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు... ఇలాంటి ప్రతిపక్ష నేత మన రాష్ట్రానికే ఖర్మ అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

"ఎన్నికలు సమీపిస్తుండడంతో మా చంద్రం అన్నయ్య తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటున్నాడు. మాచర్లను మండించాడు. ఎచ్చెర్లలో ఏంచేస్తాడో? వీధుల్లో కుక్కల్లా టీడీపీ రౌడీలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు... రాష్ట్రానికి ఇదేం ఖర్మ!" అంటూ విజయసాయి మరో ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Chandrababu
Opposition Leader
YSRCP
TDP

More Telugu News