fifa: ఫిఫా వరల్డ్ కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతంటే..

  • రన్నరప్ జట్టుకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ
  • క్వార్టర్ ఫైనల్స్ లో చేరిన జట్లకు కూడా అందనున్న బహుమతి
  • కోట్లల్లోనే ప్రైజ్ మనీ అందుకోనున్న గ్రూప్ దశలో పాల్గొన్న జట్లు
Prize money details for FIFA World Cup 2022 winner and runner up

ఖతార్ వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో గెలిచి ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచిన జట్టుకు అందే ప్రైజ్ మనీ ఎంతుంటుందో తెలుసా.. అలాగే రన్నరప్‌గా నిలిచిన వారికి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతుంటుందంటే..

ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచిన జట్టు 42 మిలియన్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా 347 కోట్లు బహుమతిగా అందుకుంటుంది. ఫైనల్ మ్యాచ్ లో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకున్న జట్టు 30 మిలియన్ డాలర్లు. అంటే రూ.248 కోట్లు అందుకుంటుంది. మొత్తంగా ఫైనల్ మ్యాచ్ కు ప్రైజ్ మనీ రూ.595 కోట్లు(72 మిలియన్ డాలర్లు).

ఫైనల్స్ కు అడుగుదూరం(మూడో స్థానం)లో నిలిచిన జట్టు క్రొయేషియాకు రూ.223 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న మొరాకో కు రూ.206 కోట్ల క్యాష్ బహుమతిగా అందుతుంది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన జట్లు.. బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్ లకు రూ. 140 కోట్ల చొప్పున అందజేస్తారు. గ్రూప్ దశలో పాల్గొన్న ఖతార్, ఈక్వెడార్, వేల్స్, ఇరాన్, మెక్సికో, సౌదీ అరేబియా, డెన్మార్క్, ట్యునీషియా, కెనడా, బెల్జియం, జర్మనీ, కోస్టారికా, సెర్బియా, కామెరూన్, ఘనా, ఉరుగ్వే జట్లు రూ. 74 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ అందుకుంటాయి.

More Telugu News