Team India: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. విజయానికి చేరువగా భారత్

India near To win against Bangladesh In First Test
  • 8 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
  • చివరి రోజు తొలి దెబ్బ కొట్టిన సిరాజ్
  • వేగంగా ఆడిన కెప్టెన్‌ను పెవిలియన్ పంపిన కుల్దీప్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విజయానికి భారత్ మరింత దగ్గరైంది. ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 283 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన మెహిదీ హసన్‌(13)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి జట్టును విజయానికి మరింత దగ్గర చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ షకీబల్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. 

వేగంగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేసిన షకీబల్.. 108 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 191 పరుగులు అవసరం కాగా చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్ల జోరు చూస్తుంటే మరికాసేపట్లో భారత్ విజయం ఖాయం. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నారు.
Team India
Bangladesh
Kuldeep Yadav

More Telugu News